విశ్వశాంతి కోసం నగర సంకీర్తన
VSP: హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో విశ్వశాంతి కోసం ఆదివారం నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీతమ్మధార కాశ్యప్ సూపర్ మార్కెట్ సమీపంలో ప్రారంభమైన సంకీర్తన స్నేపర్ పార్క్ వద్ద ముగిసింది. భక్తులు హరే కృష్ణ మహామంత్ర జపంతో పాటు సంగీత వాయిద్యాలు, నృత్యాలతో సంకీర్తన నిర్వహించారు.