పామాయిల్ బోర్డును సాధిస్తాం: తాండ్ర

ఖమ్మం: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేలా కృషి చేస్తున్నట్లు ఖమ్మం బీజేపీ నేత తాండ్ర వినోద్ రావు మంగళవారం తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పామాయిల్ బోర్డు సాధనకు కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తానని వెల్లడించారు.