'గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం'

'గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం'

NGKL: గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముది గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితా సవరణ, తుది ప్రచురణపై చర్చించారు.