VIDEO: అధ్వానంగా హాషింపూర్ రహదారి

VIDEO: అధ్వానంగా హాషింపూర్ రహదారి

ADB: భోరజ్ మండలం హాషింపూర్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. కంకర తేలి రోడ్డు అధ్వానంగా మారడంతో గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయాల్లో ప్రయాణం మరింత కష్టంగా మారుతోందని వాహనదారులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని స్థానికులు కొరారు.