చిలకలూరిపేటలో గంజాయి ముఠా అరెస్టు

చిలకలూరిపేటలో గంజాయి ముఠా అరెస్టు

PLD: చిలకలూరిపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో గంజాయి అమ్ముతున్న 18 మంది ముఠా సభ్యులను సీఐ సుబ్బనాయుడు శుక్రవారం అరెస్టు చేశారు. ఇందులో గంజాయి అమ్ముతున్న ఏడుగురు, గంజాయి తాగే 11 మందిపై కేసు నమోదు చేశారు. అనంతరం వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, రూ.13 లక్షల విలువైన ఆభరణాలు, ఒక ఫోను, రూ. 3,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.