'సాగునీటి కాలువ ఆక్రమణలు తొలగించాలి'

'సాగునీటి కాలువ ఆక్రమణలు తొలగించాలి'

AKP:మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామ పరిధిలో నాగులపల్లి అగ్రహారం సాగునీటి కాలువ ఆక్రమణలను తొలగించాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం తహసిల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలువను మూసివేసి రహదారి ఏర్పాటు చేసుకున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనివల్ల సాగునీరు అందడం లేదన్నారు.