అమలాపురంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

కోనసీమ: అమలాపురంలో కొత్త విద్యుత్ టవర్ల ఏర్పాటు, లైన్ల మరమ్మతుల పనుల కారణంగా ఈనెల 12,13,14 తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ట్రాన్స్‌కో ఈఈ రాంబాబు తెలిపారు. ఈ మూడు రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అమలాపురం, ముమ్మిడివరం గేట్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.