ఎత్తయిన పర్వతంపై టీడీపీ జెండా

ఎత్తయిన పర్వతంపై టీడీపీ జెండా

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి చెందిన అనుమోలు ప్రభాకరరావు, యూరప్‌లోని అత్యంత ఎత్తైన 5, 642 మీటర్ల ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి టీడీపీ జెండాను ఎగురవేశారు. ఆగస్టు 1న బయల్దేరిన ఆయన రష్యాలోని మినెరల్నీ వోడీ చేరుకుని, రెండు రోజుల అభ్యాసం అనంతరం 6న మధ్యాహ్నం 12. 30కు శిఖరాన్ని చేరుకున్నారు. ఈ విజయాన్ని తన పర్వతారోహణలో మైలురాయిగా పేర్కొన్నారు.