'ఎన్నికల ప్రవర్తన నియమావాళిని కఠినంగా అమలు చేస్తాం'
MHBD: ఎన్నికల ప్రవర్తన నియమావాళిని కఠినంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు. జిల్లా పరిధిలో జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ దశను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేస్తూ నామినేషన్ల సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేశామన్నారు.