దివ్యాంగుడుకి టచ్ ఫోన్ అందజేత
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలకు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది అర్జీదారుని సమక్షంలోనే పరిష్కరిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం చినబోగిలికి చెందిన దివ్యాంగుడైన చుక్కా గణేష్ తనకు టచ్ ఫోన్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు.