డ్రైవర్లను ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది: CITU

NTR: ఆటో క్యాబ్ డ్రైవర్లను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ CITU ప్రధాన కార్యదర్శి దుర్గారావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వాహన మిత్ర పథకంలో భాగంగా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వాహన యజమానులకు మాత్రమే అందించడం సరి కాదని తెలిపారు.