'ధార్' ముఠా అరెస్ట్.. చోరీ సొత్తు స్వాధీనం
E.G: నల్లజర్లలో ఇటీవల ఓ వృద్ధురాలిపై దాడి చేసి బంగారం చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ 'ధార్ గ్యాంగ్'సభ్యులు ఆరుగురిని శనివారం అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 3 లక్షల నగదు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు DSP దేవకుమార్ తెలిపారు.