'స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగరవేస్తాం'

JN: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు పోరాడుతామని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసే దిశగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.