అంగన్వాడీ సెంటర్లో 'పోషణ పక్వాడ' కార్యక్రమం
SRPT: హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ అంగన్వాడీ సెంటర్లో 'పోషణ పక్వాడ' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీడీపీవో శ్రీ లిఖిత పాల్గొని మాట్లాడారు. పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ టైము తగ్గించి, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించాలని సూచించారు. అధిక డిజిటల్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.