భీమేశ్వర స్వామి వారి ఆలయానికి రూ.50,000 విరాళం
W.G: ఆకివీడులోని అత్యంత మహిమాన్వితుడైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి ఆకివీడుకు చెందిన భక్తుడు తోట రవిచంద్ర రూ. 50 వేలు విరాళాన్ని అందించారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఆలయ అభివృద్ధికి ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు రవిచంద్ర చెప్పారు. ఈ విరాళాన్ని ఆలయ పాలకవర్గ సభ్యులకు అందజేశారు. దాతను పలువురు అభినందించారు.