చరణ్ బర్త్ డే.. మెగాస్టార్ రూ.10 లక్షల విరాళం
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సేవాగుణాన్ని మరోసారి చాటుకున్నాడు. NTR జాతీయ అవార్డుతో పాటు వచ్చిన రూ.10 లక్షల నగదు బహుమతిని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేశాడు. ఈ సందర్భంగా ఒక సేవా సంస్థను సందర్శించిన చిరంజీవి.. అక్కడి వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి చరణ్ పుట్టినరోజు వేడుకలను జరిపాడు. అనంతరం వారికి స్వయంగా భోజనం వడ్డించి, కొత్త దుస్తులను పంపిణీ చేశాడు.