ప్రజలు కారును షెడ్డుకి పంపించారు: సీఎం

ప్రజలు కారును షెడ్డుకి పంపించారు: సీఎం

HYD: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బోరబండలో సీఎం రేవంత్‌ కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కారును షెడ్డుకి పంపించారని, ఇప్పుడు బిల్లారంగాలు ఆటోల్లో తిరుగుతున్నారని అన్నారు. పేదల దైవం పీజేఆర్‌ మరణించినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయానికి టీడీపీ కూడా మద్దతు తెలిపిందన్నారు.