నేటి నుంచి 30 వరకు ఏపీపీఎస్సీ పరీక్షలు

TPT: తిరుపతిలో ఏపీపీఎస్సీ పరీక్షలు ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5వరకు రెండు సెషన్స్ జరగనున్నాయి. చెర్లోపల్లి అయాన్ డిజిటల్ జోన్, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తారు. 1,929 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.