10వ తరగతి విద్యార్థినిలకు పరీక్షా కిట్లు పంపిణీ
ASF: పెంచికల్ పేట మండలంలోని కేజీబీవీ బాలికల నివాస పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు 150కి పైగా శానిటరీ నాప్కిన్‌లను సీఐ కుమారస్వామి, ఎస్సై అనిల్‌లు ఆదివారం పంపిణీ చేశారు. అలాగే 10వ తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులకు పరీక్షా కిట్లు అందజేశారు. సీఐ మాట్లాడుతూ.. విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.