ముమ్మరంగా వాహనాల తనిఖీలు

ముమ్మరంగా వాహనాల తనిఖీలు

NDL: నంద్యాల పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరంగా చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం రాత్రి స్థానిక శ్రీనివాస సెంటర్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు. రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిని పట్టుకుని జరిమానాలు వేశారు. వాహనాలు నడిపేవారు అన్ని రికార్డులను తప్పనిసరిగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు.