ఇజ్రాయెల్-అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు
ఇజ్రాయెల్-అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. సైనిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసింది. యూఏఈలోని 3 ఓడరేవుల నుంచి ప్రజలు వెళ్లిపోవాలని ఇరాన్ సూచించింది. ఖర్గ్ ద్వీపంపై దాడులకు ప్రతీకారంగా అమెరికా ఓడరేవులను టార్గెట్ చేసుకుంటున్నట్లు వెల్లడించింది. దుబాయ్‌లోని జెబల్ అలీ, అబుదాబీలో ఖలీఫా నుంచి ప్రజలు వెళ్లిపోవాలని సూచించింది.