క్రికెట్ లీగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా
PLD: సత్తెనపల్లి పట్టణంలోని శరభయ్య హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న బాబీ మెమోరియల్ సత్తెనపల్లి క్రికెట్ లీగ్-2026 (సీజన్-5) టోర్నమెంట్‌ను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందించడంలో ఇలాంటి టోర్నమెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.