'కలుషిత ఆహార బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'
WNP: జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాల్లో, విద్యాలయాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం బారిన పడకుండా మందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్‌లో తన ఛాంబర్‌లో సమీక్షించారు. ఆహార పదార్థాల నమూనాలను తీసుకుని ఫుడ్ సేఫ్టీ అధికారికి పరీక్ష నిమిత్తం పంపించాలని సూచించారు.