VIDEO: షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
ADB: భోరజ్ మండలంలోని బాలాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇవాళ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెల్గాం గ్రామ సమీపంలో సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేపట్టనుందని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ద్వారా గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం తమ లక్ష్యమని అన్నారు.