ప్రముఖ మీడియా సంస్థపై పరువు నష్టం దావా

AP: తిరుమల తిరుపతి దేవస్థానంపై అసత్య ప్రచారం చేస్తున్నారని సాక్షి మీడియాపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం ప్రచురిస్తున్నారని లీగల్ నోటీసులు పంపారు. సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.