కంచరపాలెంలో 21న జాబ్ మేళా
విశాఖ: కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు.