మాజీ సీఎం జగన్‌తో పాలకొల్లు ఇన్‌ఛార్జ్ గోపీ భేటీ
WG: పాలకొల్లు వైసీపీ ఇన్‌ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు (గోపీ) బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై వారు చర్చించుకున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జగన్ తనకు సూచించినట్లు గోపీ తెలిపారు.