గృహ ప్రవేశంలో పాల్గొన్న ఇంఛార్జ్ కలెక్టర్
SRCL: ఇల్లంతకుంట (M)అనంతారం గ్రామంలో గన్నెపల్లి అనూష ఇందిరమ్మ ఇంటి నూతన గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. అనంతరం గృహ ప్రవేశం చేసి, లబ్ధిదారురాలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల సొంతిఇంటి కల నెరవేరుతున్నదని తెలిపారు.