నాతవలసలో నూతన సచివాలయం ప్రారంభం
VZM: మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి సంయుక్తంగా సోమవారం డెంకాడ మండలం నాతవలసలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు.