పరిశుభ్రత పర్యావరణంపై గ్రామస్తులకు అవగాహన

పరిశుభ్రత పర్యావరణంపై గ్రామస్తులకు అవగాహన

NLG: "ప్రజా పాలన-ప్రగతి పాలన"లో భాగంగా చిట్యాల మండలం, చిన్నకాపర్తిలో గ్రామస్తులకు పర్యావరణంపై ఇవాళ అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, సర్పంచ్ ఆవుల సుందరయ్య, కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ పాల్గొన్నారు.