CM చంద్రబాబుకు కృతజ్ఞతలు: మంత్రి
NDL: రాష్ట్రంలోని ఇమామ్లలు, మౌజన్ల వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం రూ. 90 కోట్లు విడుదల చేసింది. ఇమామ్లకు నెలకు రూ. 10,000, మౌజను నెలకు రూ.5,000 చొప్పున 2024 ఏప్రిల్-జూన్, 2025 జనవరి-సెప్టెంబర్ నెలలకు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం, సాధికారతకు కట్టుబడి ఉందని తెలిపారు.