విజయానికి షార్ట్‌కట్‌లు ఉండవు: భువనేశ్వరి
AP: కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి.. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. విజయానికి షార్ట్‌కట్‌లు ఉండవని, పట్టుదలతోనే విజయం సాధించాలని విద్యార్థులకు తెలిపారు.