చెమికి అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ' చెమికి ' అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించి 'చెమికీతో ' ప్రత్యేకంగా అలంకరించారు. ఆ తర్వాత ధూపతి నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.