28ఏళ్ల తర్వాత మళ్లీ అదే కాంబో రిపీట్
దాదాపు 28ఏళ్ల తర్వాత తమిళ స్టార్ రజినీకాంత్, దర్శకుడు సుందర్ సి కాంబోలో మూవీ రాబోతుంది. 'తలైవార్ 173' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. ఇది 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా, రజినీ, సుందర్ కాంబోలో 'అరుణాచలం'(1997) మూవీ వచ్చిన విషయం తెలిసిందే.