కోట మరణం బాధాకరం: రోజా

CTR: ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మరణంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ఆయన మరణం బాధాకరమన్నారు. కోట ఇక లేరన్న వార్త తనను కలిచి వేసిందన్నారు. 750పై చిలుకు చిత్రలలో నటించిన గొప్ప నటుడు కోట అని కొనియాడారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.