రిటైర్డ్ హెచ్ఎంను సన్మానించిన ఎంఈవోలు

రిటైర్డ్ హెచ్ఎంను సన్మానించిన ఎంఈవోలు

SKLM: విధి నిర్వహణలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయని ఎంఈ.వో 1, 2 జి.నరసింహులు, చిన్నారావు పేర్కొన్నారు. నందిగాం మండలం హరిదాసుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ శశిధర్ బాబు పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. అనంతరం శశిధర బాబుకి దుశ్శాలువతో సన్మానించి సత్కరించారు.