VIDEO: జిల్లాలో కురిసిన అకాల వర్షం.. రైతుల్లో ఆందోళన
MNCL: పలు మండలాల్లో శుక్రవారం రాత్రి ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. జన్నారం మండలంలోని తిమ్మాపూర్, తపాలాపూర్, రోటిగూడ, చింతగూడతో పాటు దండేపల్లి మండలంలోని తాళ్లపేట, నాగసముద్రం, మొకాసిగూడ, మెదరపేట, ద్వారక, ధర్మారావుపేట గ్రామాల్లో వాన దంచికొట్టింది. ఈ వర్షం మొక్కజొన్న, వరి పంటలకు మేలు చేస్తుండగా, మిర్చి పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.