VIDEO: నడిరోడ్డుపై భారీ వాహనాల నిలిపివేత
KMM: వేంసూరు మండలం మర్లపాడు ప్రధాన సెంటర్‌లో నడిరోడ్డుపై భారీ వాహనాలను నిలిపి వేస్తున్నారని స్థానికులు తెలిపారు. దీని కారణంగా వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అలాగే రోడ్డు ఇరువైపులా అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేయడంతో పాదచారులు నడిచేందుకు వీలు లేకుండా ఉందని అన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.