ఛలో కరేడు కార్యక్రమానికి అనుమతి లేదు: DSP

NLR: రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18న తనపెట్టనున్న ఛలో కరేడు కార్యక్రమానికి అనుమతి లేదని డీఎస్పీ బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. శనివారం కందుకూరు డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలు చేస్తున్నారని, ఎవరైనా గ్రామానికి వెళ్లి రైతులను రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.