ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయండి: కలెక్టర్
KMR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మద్నూర్, ఎల్లారెడ్డి, భిక్నూర్ మండలాల్లోని ఇళ్ల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులను త్వరగా చేపట్టి, లక్ష్యాన్ని వంద శాతం చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు.