అండర్-16 క్రికెట్ మ్యాచ్‌లో సత్తా చాటిన అడ్డాకుల వాసి
మహబూబ్ నగర్: అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి చెందిన అండర్-16 క్రికెట్ క్రీడాకారుడు యాట కౌశిక్ హైదరాబాద్ బండ్లగూడ గ్రీన్ వ్యూ2 గ్రౌండ్‌లో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ టీం తరఫున బరిలోకి దిగిన కౌశిక్ మొదటి నుంచి ఎదురు దాడికి దిగాడు. ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ నాయకులు అతడిని అభినందించారు.