450 లీటర్ల నాటుసారా స్వాధీనం
SKLM: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాలలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖాధికారులు బుధవారం సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడులలో 450 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్టు పాతపట్నం ఎక్సైజ్ సీఐ కృష్ణారావు తెలిపారు. పాతపట్నం, మెళియాపుట్టి పలాస మండలాల సరిహద్దులో గ్రామాలలో దాడులు చేపట్టామని తెలిపారు. నిందుతలపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.