నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KRNL: అభివృద్ధి పనుల్లో భాగంగా నగరంలో ఇవాళ ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు డివిజన్ ఈఈ శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. మహాలక్ష్మినగర్, సోమప్పకాలనీ, ఎన్సీ సీక్యాంటిన్ తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు వివరించారు.