పెరంబూర్ నుంచి విజయ్ పోటీ?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో TVK అధినేత, నటుడు విజయ్ చెన్నై జిల్లా పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కొడుంగైయూర్‌లో సిద్ధమవుతున్న పార్టీ కార్యాలయం కూడా ఆయన కోసమేనని, పెరంబూర్ నుంచి ఆయన ఇవాళ ప్రచారం ప్రారంభిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజులు ఇక్కడే ఉండి ఓట్లు అభ్యర్థిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.