IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ టాస్ గెలిచి, మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. గిల్, బుమ్రా, పాండ్యా ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చారు. దీంతో సంజూ శాంసన్, కుల్దీప్, వాషింగ్టన్, హర్షిత్ రాణాకు తుది జట్టులో చోటు దక్కలేదు.