VIDEO: విద్యార్థులే వంట మనుషులు

KDP: తోటి విద్యార్థులకే విద్యార్థులు భోజనం వడ్డిస్తున్న వైనం సిద్ధవటం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఉప్పరపల్లె SPBVD సభా హైస్కూల్లో 172 మంది విద్యార్థులు ఉండగా 150 మంది హాజరయ్యారు. గురువారం విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని తోటి విద్యార్థులు వడ్డించడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.