యాగంటి రథోత్సవంలో పాల్గొన్న బీసీ ఇందిరా రెడ్డి

యాగంటి రథోత్సవంలో పాల్గొన్న బీసీ ఇందిరా రెడ్డి

NDL: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం నిర్వహించిన స్వామివారి రథోత్సవంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి పాల్గొన్నారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె భక్తులతో కలిసి రథోత్సవాన్ని వీక్షించారు.