మహిళలకు రక్షణ కవచం'శక్తి' యాప్

మహిళలకు రక్షణ కవచం'శక్తి' యాప్

KDP: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సి.కె దిన్నెCI బాలమద్దిలేటి ఆధ్వర్యంలో ఆర్‌పీఎస్ నగర్‌లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘శక్తి’ యాప్ వినియోగంపై వివరించి, అత్యవసర సమయంలో ఎస్‌ఓఎస్ లేదా 112 ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.