'ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి'

'ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి'

ఆదిలాబాద్: ఆశా కార్యకర్తలపై పని భారాన్ని తగ్గించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారితోషికం లేని సర్వేలను ఆశా కార్యకర్తలతో చేయించవద్దని అన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని అన్నారు.