బ్యాంకు కాల్స్ ‘1600’తోనే రావాలి: TRAI

బ్యాంకు కాల్స్ ‘1600’తోనే రావాలి: TRAI

బ్యాంకు ఖాతాదారుల భద్రత కోసం TRAI చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల సంస్థలు కస్టమర్లకు చేసే కాల్స్ 1600 సిరీస్‌తోనే రావాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు వచ్చే జనవరి 1 నుంచి.. మ్యూచువల్ ఫండ్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు ఫిబ్రవరి 15 నుంచి దీన్ని అమలు చేయాలని స్పష్టమైన గడువు విధించింది.